: కార్మికుల సొమ్మును కొల్లగొట్టిన నేతలకు కవిత వత్తాసు పలుకుతున్నారు: మంద కృష్ణ


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి కాలరీస్ బొగ్గు గని కార్మికుల సభ్యత్వ సొమ్మును కొందరు నేతలు తమ ఖాతాల్లో వేసుకున్నారని... వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని... ఆ కేసు ముందుకు సాగకుండా కవిత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిపై పోరాడుతున్నామని చెప్పుకునే కవిత... ఇలాంటి చర్యలకు పాల్పడటమేమిటని ప్రశ్నించారు. అవినీతి నేతలకు వత్తాసు పలకడమేమిటని నిలదీశారు.

  • Loading...

More Telugu News