: క్రికెటర్ హ్యూస్ తన స్నేహితురాలికి పంపిన చివరి సందేశం ఇదే!


ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా, అతని జ్ఞాపకాలు మాత్రం బంధుమిత్రులు, అభిమానుల వెన్నంటే ఉంటాయి. బౌన్సర్ తాకి ఆసుపత్రి పాలవడానికి ముందు, హ్యూస్ తన బెస్ట్ ఫ్రెండ్ మీగన్ సింప్సన్ (26) కు పంపిన సంక్షిప్త సందేశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను సింప్సన్ ను ఎంత ఇష్టపడుతున్నదీ తన సందేశం ద్వారా వెలిబుచ్చాడీ యువ బ్యాట్స్ మన్. 'లవ్యూ.. మిస్ యూ... లవ్యూ.. మిస్ యూ' అంటూ సాగిన ఆ సందేశమే హ్యూస్ నుంచి వెళ్లిన చివరి సందేశం. కాగా, వీరిద్దరూ మూడేళ్ల క్రితం సిడ్నీలోని ఓ పబ్ లో కలుసుకున్నారు. తొలుత హ్యూస్ తానో బ్యాంకర్ నంటూ సింప్సన్ తో పరాచకాలాడట. అనంతరం, లేట్ నైట్ ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ లు, ఓవర్సీస్ షికార్లతో వీరి బంధం బలపడింది. కాగా, హ్యూస్ నుంచి చివరి సందేశం అందుకున్న సమయంలో సింప్సన్ హవాయిలో ఉందట.

  • Loading...

More Telugu News