: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు త్వరలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అటు, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ కూడా రుణమాఫీ పరిమితులపై సర్కారును ఇరకాటంలోకి నెట్టేందుకు శతధా ప్రయత్నిస్తుందనడంలో సందేహంలేదు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రవ్యాప్త ధర్నాలతో ప్రభుత్వ విధానాలపై పోరు సాగిస్తోంది.