: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెక్కేశాడు!


విదేశాల్లో ఉద్యోగం అనేసరికి వారందరూ అతడికి భారీగా ముట్టజెప్పారు. అయితే, ఉద్యోగం రాలేదు, వారు కట్టిన డబ్బులూ రాలేదు! విశాఖలోని గోపాలపట్నంలో చోటు చేసుకుందీ ఘరానా మోసం. వివరాల్లోకెళితే... సింగపూర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని శంకర్ దాస్ అనే వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. అతడు ఉద్యోగం పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు రాబట్టాడు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో 20 మంది బాధితులు శంకర్ దాస్ పై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News