: ఎంపీ ల్యాడ్స్ సద్వినియోగానికి విశాఖ ఎంపీ ‘వన్ ఎంపీ... వన్ ఇండియా’కు శ్రీకారం
పార్లమెంట్ నియోజకవర్గ నిధుల వినియోగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విశాఖ ఎంపీ హరిబాబు వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. ‘వన్ ఎంపీ... వన్ ఇండియా’ పేరిట రూపొందించిన ఈ కార్యక్రమం తాలూకు వాల్ పోస్టర్ ను నేడు ఆయన విశాఖపట్నంలో ఆవిష్కరించారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు సలహాలు, సూచనలను అందజేయవచ్చని తెలిపారు. ప్రజల నుంచి అందే సూచనల్లో అత్యుత్తమమైనవిగా ఎంపిక చేసిన వాటికి నిధులను కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. ఒక్కో ఎంపీకి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏటా రూ.5 కోట్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.