: ధోనీ సేనపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్


టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అన్నాడు. గతేడాది భారత గడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశాడు. తమ దేశంలో జరగనున్న సిరీస్ లో టీమిండియాకు పరాభవం తప్పదని వ్యాఖ్యానించాడు. తమ జట్టు సభ్యులంతా పూర్తి స్థాయి ఫిట్ నెస్ తో ఉన్నారని, టీమిండియాకు తీవ్ర నిరాశ తప్పదని చెప్పాడు. తొలి టెస్ట్ లో టీమిండియాను మట్టికరిపిస్తామన్నాడు. గతేడాది 0-4 తేడాతో సిరీస్ ను టీమిండియాకు చేజార్చుకున్న కంగారూలు తాజా సిరీస్ ను చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీమిండియాను కట్టడి చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసినట్లు వాట్సన్ తెలిపాడు. ‘టీమిండియాను ఎలా నిలువరించాలో మాకు తెలుసు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈసారి బాల్ తోనే కాక బ్యాట్ తోనూ టీమిండియాకు సమాధానం చెబుతాం’ అని అతడు చెప్పాడు.

  • Loading...

More Telugu News