: దేవుడు నన్ను మోసం చేశాడు... కుప్పకూలిన హరికృష్ణ
దేవుడు తనను మోసం చేశాడని నందమూరి హరికృష్ణ కుప్పకూలిపోయారు. కుమారుడు జానకీరామ్ మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. తెల్లవారు జామున 3 గంటలకే ప్రతినిత్యం దేవుడ్ని స్మరించుకుంటానే, అలాంటిది తనకే ఎందుకు ఇంత కడుపుకోత పెట్టాడంటూ ఆయన రోదిస్తున్నారు. హరికృష్ణ భార్య కుమారుడి మరణ వార్త తెలిసిన వెంటనే కుప్పకూలిపోయారు. ఆమె రోదిస్తున్న తీరుకు అంతా చలించిపోతున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.