: జస్ట్ మిస్సయ్యారు... మరోసారి మావోలు పోలీసులను టార్గెట్ చేశారు
ఛత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఘటన మరువక ముందే మరోసారి పోలీసులను మావోయిస్టులు టార్గెట్ చేశారు. విశాఖపట్టణం జిల్లా జీకే వీధి మండలంలో పోలీసులే లక్ష్యంగా రెండు మందుపాతరలు పేల్చారు. పేలుడు ప్రమాదం నుంచి పోలీసులు తృటిలో తప్పించుకున్నారు. కుంకుమపూడి, నక్కబంద అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కూంబింగ్ ను ముమ్మరం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.