: నైజీరియాలో శ్రీనివాస్ క్షేమం


నైజీరియాలో కిడ్నాప్ కు గురైన శ్రీనివాసరావు ఆచూకీ లభించినట్టు అతని తండ్రి శేషయ్య తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన టంగుటూరి శ్రీనివాసరావు నైజీరియాలో అపహరణకు గురైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే నైజీరియా అధికారులతో మాట్లాడి ఈ విషయం ధ్రువీకరించారని శేషయ్య తెలిపారు. కాగా, శ్రీనివాస్ ను ఎవరు? ఎందుకు అపహరించారు? వారి డిమాండ్లు ఏమిటి? అనేది తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News