: జమ్మూ కాశ్మీర్ తో తొలిసారి పోటీ పడనున్న ముంబై
41వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ ను అందుకోవాలని తహతహలాడుతున్న ముంబై జట్టు గ్రూప్ ఏలోని జమ్మూ కాశ్మీర్ జట్టుతో తోలి మ్యాచ్ ని ఆడనుంది. మాములుగా అయితే ఇదేమీ పెద్ద విషయం కాదు. కానీ, 80 సంవత్సరాల రంజీ చరిత్రలో ఈ రెండు జట్లూ తొలిసారిగా పోటీ పడనుండటమే విశేషం. ముంబై టీంలో కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, రహానేలు అందుబాటులో లేరు. రేపు జరగనున్న ఈ మ్యాచ్ కోసం వాంఖడే స్టేడియం ముస్తాబైంది.