: సెయిల్ వాటా అమ్మకానికి రెట్టింపు స్పందన
ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా జరిపిన వాటాల అమ్మకం విజయవంతంగా ముగిసింది. ఈ ఆఫర్ సేల్ కు ఇన్వెస్టర్ ల నుంచి రెట్టింపు స్పందన లభించింది. మొత్తం 20.65 కోట్ల వాటాలను అమ్మకానికి ఉంచగా 42.98 కోట్ల వాటాలకు దరఖాస్తులు అందాయి. కాగా, వాటా అమ్మకం తరువాత కేంద్ర ఖజానాకు రూ.1,715 కోట్లు చేరనున్నాయి.