: పాక్ సాయంతోనే ఉగ్ర దాడి... దొరికిన సాక్ష్యాధారాలు


ఇండియాపై ఎప్పుడు ఉగ్రవాద దాడులు జరిగినా 'మాకు ఎటువంటి సంబంధం లేదు' అంటూ పాకిస్తాన్ చెప్పడం మామూలే. వారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే అనేది అందరికీ తెలిసిన సత్యం. నిన్న ఉగ్రవాదులు భారీ ఎత్తున భారత స్థావరాలపై, సైన్యంపై దాడికి తెగబడి దాదాపు 20 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టాక జరిపిన పరిశీలనలో పాక్ ప్రమేయంపై ఆధారాలు చిక్కాయి. కాశ్మీర్‌లో మృతి చెందిన ఉగ్రవాదుల దగ్గర దొరికిన ఆహార పొట్లాలపై పాక్ ఆనవాళ్ళు ఉన్నాయని ఆర్మీ చెప్పింది. ఎన్‌కౌంటర్ స్థలంలో లభ్యమైన అన్నం పొట్లాలు పాక్ ఆర్మీ తయారు చేసినవే అని భారత అధికారి ఒకరు చెప్పారు. కాగా, ఉగ్రవాదులు సమకూర్చుకున్న ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని చూస్తే, వారు చాలా సమయం ఆర్మీతో ఘర్షణ పడటానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News