: అందుకే కాంగ్రెస్ లో పీఆర్పీని విలీనం చేశా: చిరంజీవి


సామాజిక న్యాయం కోసమే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని సినీనటుడు చిరంజీవి అన్నారు. భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం స్వయంగా చూశానని, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని భావించిన మీదటే విలీనానికి అంగీకరించానని తెలిపారు. ఆయనతో పాటు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

  • Loading...

More Telugu News