: శ్రీవారి సేవలో సినీనటుడు అర్జున్
ప్రముఖ సినీ నటుడు అర్జున్ ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్జున్ కు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ రాష్ట్ర ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.