: హైదరాబాదులో 144 సెక్షన్... మోహరించిన 70 ప్లాటూన్ల బలగాలు
బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ముస్లిం మత సంస్థలు నేడు బ్లాక్ డే నిర్వహిస్తున్నాయి. ఐబీ హెచ్చరికలు, బ్లాక్ డే నేపథ్యంలో, అత్యంత సున్నితమైన హైదరాబాదులో హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు, 144 సెక్షన్ విధించారు. 70 ప్లాటూన్ల బలగాలతో నగరంలోని ఓల్డ్ సిటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పహారా కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ర్యాలీలు, సమావేశాలను నిషేధించారు. సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున బాబ్రీ మసీదును కూల్చి వేశారు.