: నెల్సన్ మండేలాకు ఘనంగా నివాళి అర్పించిన దక్షిణాఫ్రికా
నల్లసూరీడు నెల్సన్ మండేలాకు దక్షిణాఫ్రికా ప్రజలు ఘనంగా నివాళి అర్పించారు. మండేలా తొలి వర్ధంతి సందర్భంగా, నిన్న సూర్యోదయం సమయంలో ప్రిటోరియా హిల్స్ పై గిరిజన నేత రోన్ మార్టిన్ సుగంధ ద్రవ్యాలను మండించి సంప్రదాయబద్ధంగా నివాళి అర్పించారు. ఫ్రీడం పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో వేలాది మంది తమ అభిమాన నేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.