: బుర్ద్వాన్ పేలుళ్ల ఉగ్రవాది అరెస్ట్


పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పేలుళ్ల ఘటనతో సంబంధమున్న ఉగ్రవాది షహనూర్ ఆలంను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్ ఇచ్చిన సమాచారంతో ఈ ఉగ్రవాదిని అసోంలోని నల్బంది జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కా స్కెచ్ తో ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) లో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి షహనూర్ అత్యంత కీలకమైన వ్యక్తి.

  • Loading...

More Telugu News