: స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్


స్పైస్ జెట్ కు డీజీసీఏ షాక్ ఇచ్చింది. స్పైస్ జెట్ తీరు అనుమానాస్పదంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించడంతో డీజీసీఏ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఎయిర్ పోర్టులు, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు, ఆయిల్ కంపెనీలు, సేవా సంస్థలకు చెల్లించాల్సిన 1500 కోట్ల రూపాయలను నెల రోజుల్లో చెల్లించాలని డీజీసీఏ ఆదేశించింది. నెల రోజుల వరకు బుకింగ్ నిలిపేసి, గతంలో బుకింగ్ చేసుకుని సర్వీసులు రద్దు చేసిన ప్రయాణికులకు డబ్బు చెల్లించాలని స్పైస్ జెట్ కు డీజీసీఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా స్పైస్ జెట్ కోసం కేటాయించిన 186 స్లాట్స్ రద్దుచేయాలని ఎయిర్ పోర్ట్స్ అధారిటీకి డీజీసీఏ సూచించింది. ఇప్పటివరకు పేరుకున్న ఉద్యోగుల వేతన బకాయిలను పది రోజుల్లోగా చెల్లించాలని స్పైస్ జెట్ కు డీజీసీఏ ఆదేశించింది. అలాగే అంతా పూర్తయిన తరువాత సంస్థలోని ఉద్యోగులు, సంస్థ విమానాలు నడిపే షెడ్యూల్ తో స్పూర్తి దాయకమైన పూర్తి వివరాలు అందించాలని డీజీసీఏ స్పైస్ జెట్ కు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News