: వేతనాల్లో స్త్రీలపై వివక్ష


పని చేసే మహిళలు విద్య, అనుభవం, ఉత్పాదకతలో మగవారికన్నా ముందున్నప్పటికీ సగటున వారికి తక్కువ వేతనమే లభిస్తుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. 38 దేశాల్లో ఈ వివక్ష కొనసాగుతోందని ఐఎల్ఓ నివేదిక వెల్లడించింది. అన్నింటికంటే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఈ వివక్ష అధికంగా ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. అమెరికాలో పురుషులు సంపాదించే ప్రతి 100 డాలర్లతో పోలిస్తే స్త్రీలకు 64.20 డాలర్లు మాత్రమే అందుతున్నాయని నివేదిక వెల్లడించింది. పురుషులు ఎక్కువ ఉత్పాదకత సాధిస్తుండడం, చదువు లేదా అనుభవం కలిగి ఉండడం ఇందుకు కారణమవుతున్నాయని నివేదిక వివరించింది. యూరప్, రష్యా, బ్రెజిల్ లోని స్త్రీలు మగవారికన్నా ముందున్నా...వేతనాల్లో వ్యత్యాసం అలాగే ఉంటోందని ఐఎల్ఓ నివేదిక తెలిపింది. దీనికి కారణాలేవైనా స్త్రీల వేతనాల్లో వ్యత్యాసం అలాగే ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News