: అరుణ గ్రహంపైకి అమెరికా అంతరిక్ష ప్రయోగం విజయవంతం...భవిష్యత్తుపై కొత్త ఆశలు


హాలీవుడ్ సినిమాల్లో సంఘటనలను సైన్సు నిజం చేస్తోంది. అరుణ గ్రహంపైకి మనుషులను తీసుకెళ్లే దిశలో అమెరికా చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. మానవ సహిత ప్రయోగానికి ముందస్తుగా నాసా తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా మానవరహిత వాహక నౌక 'ఆరియన్'ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7.05 నిమిషాలకు 'ఆరియన్' నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగున్నర గంటలపాటు ప్రయాణించిన 'ఆరియన్' నిర్దేశిత భూకక్ష్యలో ప్రవేశించింది. 'ఆరియన్'లో నలుగురు అంతరిక్ష యాత్రికులు ఉండేందుకు అవసరమైన సౌకర్యాలను శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. వేడి తాపడం, పారాస్యూట్స్, జెట్టీ స్కానింగ్ పరికరాలు ఇందులో ఉన్నాయి. 2030లో మనుషులను అంగారక గ్రహంపైకి పంపే దిశగా నాసా యోచిస్తోంది. అంతకంటే ముందుగా 2021లో నలుగురు వ్యోమగాములను అరుణ గ్రహంపైకి వెళ్లి పరిశోధనలు చేసే దిశగా నాసా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా 'ఆరియన్' ను ప్రయోగించింది.

  • Loading...

More Telugu News