: 2015లో ప్రభుత్వోద్యోగులకు సెలవులివే: ఏపీ ప్రభుత్వం
2015 సంవత్సరానికి సెలవులు ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో 21 రోజుల సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 21 రోజులను పండుగలు, ఉత్సవాలు సందర్భంగా సెలవు దినాలుగా ప్రకటించగా, మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవు దినాలుగా ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఏపీ ఉద్యోగులకు బతుకమ్మ, బోనాల పండుగలను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించారు.