: 14 మందికి కంటి చూపు పోగొట్టిన డాక్టర్ అరెస్టు


పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో 14 మందికి కంటి చూపు పోయేందుకు కారణమైన వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శస్త్రచికిత్సలు నిర్వహించిన ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్టు నేత్రవైద్య శిబిరం నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. జలంధర్ లోని ఓ ఆసుపత్రి వైద్యుడు వివేక్ అరోరా ఈ శస్త్రచికిత్సలు నిర్వహించారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అధికారులను ఆదేశించారు. బాధితులకు తాత్కాలిక పరిహారం కింద లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.

  • Loading...

More Telugu News