: ఎస్ బీఐ ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై కోత


భారతదేశ అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ.కోటి లోపున్న వివిధ మెచ్యూరిటీలపై వడ్డీ రేట్లలో 0.25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు సమర్పించిన నివేదికలో, తగ్గించిన వడ్డీ రేటు ఈనెల 8 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సవరించిన రేట్ల ప్రకారం... ఏడాది, మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన రూ.కోటి లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఉన్న 8.75 శాతం వడ్డీ, ఇక నుంచి 8.5 శాతంగా లెక్కిస్తారు. ఇక మూడు, ఐదేళ్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.50 శాతంగా... ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీ రేటు 8.25 శాతంగా లెక్కించనున్నారు. ఇదే వడ్డీ రేట్లు ఒక ఏడాది కాలపరిమితి ఉన్న డిపాజిట్లకు అంతకంటే ఎక్కువున్న వాటికి వర్తిస్తాయి.

  • Loading...

More Telugu News