: ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి తప్పకుండా వస్తుంది: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి తప్పకుండా వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. జాతీయ ఛానళ్లు, పత్రికా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బాబు కొత్త రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను వివరించారు. 2019 నాటికి నవ్యాంధ్ర రాజధాని ఫేజ్-1 పూర్తి చేస్తామని తెలిపారు. ఆరు నెలల్లో విజయవాడ ఎయిర్ పోర్టుకు అన్ని హంగులు సమకూరుస్తామన్నారు. ఏపీలో ఓడరేవులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నామని బాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాలన్నీ ఆధార్ తో అనుసంధానం చేస్తున్నామన్న సీఎం, ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా వెనుక రాజకీయనేతల హస్తం ఉందని పేర్కొన్నారు. 2019 నాటికి ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, 2025 నాటికి ఏపీ... దేశంలోని మొదటి మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఉంటుందని బాబు ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News