: కాశ్మీర్లో దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులు... 18 మంది మృతి


కాశ్మీర్ లో ఎన్నికల నేపథ్యంలో తీవ్రవాదులు ఆటంకాలు కలిగిస్తున్నారు. యూరి సెక్టార్ లోని సైనిక పోస్టుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ అధికారి సహా ఎనిమిది మంది సైనికులు, ముగ్గురు పోలీసులు, ఆరుగురు తీవ్రవాదులు మరణించారు. అటు, శ్రీనగర్ లో పోలీస్ పోస్టుపై ఇద్దరు మిలిటెంట్లు కాల్పులు జరపగా, అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక తీవ్రవాది మరణించాడు. యూరీ సెక్టార్ పరిధిలో మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News