: బ్లాక్ డే సందర్భంగా పోలీసుల విస్తృత తనిఖీలు
బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, పాతబస్తీతో పాటు ఐటీ కారిడార్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చి వేసిన సందర్భంగా ఆ రోజును బ్లాక్ డేగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.