: కొత్త హెయిర్ స్టైల్ తో ఆస్ట్రేలియా వెళ్లనున్న ధోనీ
ప్రపంచంలో ఏమూలైనా కొత్త హెయిర్ స్టైల్ రంగప్రవేశం చేసిందంటే, వెంటనే దాన్ని ఫాలో అయ్యేవారిలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందువరుసలో ఉంటాడు. మోహాక్ కటింగ్ ను భారత్ కు పరిచయం చేసిన ధోనీ, తాజాగా, హెయిర్ స్టైల్ మార్చాడు. స్పిక్-అండ్-స్పాన్ (మాడుపై మినహా మరెక్కడా జుట్టు ఉండదు) లుక్కుతో మీడియా కంటబడ్డాడు. కాగా, ఆసీస్ తో తొలిటెస్టు డిసెంబర్ 9న ఆరంభం కానుంది. ఆ సమయానికల్లా ధోనీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి.