: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ పంచిపెడతారట!


రుణమాఫీ పరిమితులను నిరసిస్తూ ఓవైపు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విశాఖలో మహాధర్నా నిర్వహిస్తుండగా, మరోవైపు, ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుపై విమర్శల దాడి చేస్తున్నారు. తొలి సంతకానికి విలువ లేకుండా చేశారని, రుణమాఫీపై మాట తప్పారని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. కాకినాడలో ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికీ పంచిపెడతామని అన్నారు. ఎన్నికల హామీలను టీడీపీ అమలు చేయడం లేదన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రుణమాఫీపై చంద్రబాబు తోక పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News