: కోటి మంది రైతులుంటే 22 లక్షల మందికే రుణమాఫీనా?: బాబుకు జగన్ సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో సుమారు కోటి మందికి పైగా అర్హులైన రైతులుంటే, కేవలం 22 లక్షల మంది మాత్రమే రైతు రుణమాఫీకి అర్హులని సీఎం చంద్రబాబు అంటున్నారని వైకాపా అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, అది కూడా, ఎంత మొత్తం ఇస్తామన్నది బాబు వెల్లడించలేదని మండిపడ్డారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన మహాధర్నాలో జగన్ ప్రసంగించారు. రైతులు తీసుకున్న రుణాలకు అపరాధ వడ్డీనే రూ.14 వేల కోట్లు ఉండగా, కేవలం రూ.5వేల కోట్లు ఇచ్చి రుణమాఫీ చేశామని బాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని జగన్ ఎద్దేవా చేశారు.