: ఏపీలో జూడాల సమ్మె విరమణ


డిమాండ్ల సాధన కోసం కొన్ని రోజుల నుంచి ఏపీలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులు దిగి వచ్చారు. తమ ఆందోళనను విరమిస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు లేఖ అందజేశారు. అంతకుముందు, గుంటూరు జిల్లా తెనాలి ఐఎంఏ హాలులో జూడాలతో మంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను విరమిస్తున్నట్టు జూడాల నేత తనూజ్ తెలిపారు. తమ డిగ్రీలను రిజిస్టర్ చేయాలని, ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో వైద్యసేవల అంశాన్ని తప్పనిసరి చేయకూడదని మంత్రిని కోరినట్టు చెప్పారు. సమ్మె విరమణతో నేటి నుంచి అన్ని బోధనాసుపత్రుల్లో సాధారణ వైద్యసేవలకు జూనియర్ వైద్యులు హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News