: సాధ్వి క్షమాపణలను అంగీకరించాలని లోక్ సభలో మోదీ ప్రకటన
పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లోక్ సభలోనూ ప్రకటన చేశారు. అటువంటి మాటలు మాట్లాడిన నేపథ్యంలో, అలాంటి భాషను ఉపయోగించవద్దని తాను మంత్రులతో చెప్పానన్నారు. ఎవరూ అలాంటి భాషను ఆమోదించరన్న మోదీ, ఆమె చేసిన పొరబాటుకు క్షమాపణలు కోరారని చెప్పారు. తను కొత్త ఎంపీనే కాక, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని కూడా మనందరికీ తెలుసునని, ఈ క్రమంలో సాధ్వి క్షమాపణలను అంగీకరించాలని ప్రధాని సభను కోరారు. క్షమాపణలు కోరిన దృష్ట్యా వివాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.