: కేంద్ర మంత్రి సాధ్వి వ్యాఖ్యలపై ఉభయసభల్లో విపక్షాల ఆందోళన
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నేటి సభా సమావేశాలు ప్రారంభం కాగానే ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులు సాధ్వి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ గంట పాటు వాయిదా పడింది. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ సాధ్వి ఉభయసభలకు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సభా వ్యవహారాలకు అడ్డుతగలడం సరికాదని గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని ప్రకటనను బేఖాతరు చేసిన విపక్షాలు శుక్రవారం కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి.