: తమ్మారెడ్డి వ్యాఖ్యలు నాకు తెలియదు: హీరో సాయి ధరంతేజ్


గంటసేపు పర్ఫామెన్స్ ఇచ్చిన ఎస్పీ బాలు రూ. కోటి సంపాదిస్తే... సినీ పరిశ్రమ మొత్తం రోజంతా శ్రమిస్తే రూ. 8 కోట్లు మాత్రమే వచ్చాయంటూ... 'మేము సైతం' కార్యక్రమం గురించి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల గురించి హీరో సాయి ధరంతేజ్ ను విలేకరులు ప్రశ్నించగా, ఆ వ్యాఖ్యల గురించి తనకేమీ తెలియదని చెప్పాడు. మంచి కారణంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని... దానిపై వచ్చిన విమర్శల గురించి తనకేమీ తెలియదని అన్నాడు. ఈ రోజు తెల్లవారుజామున ధరంతేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News