: రాజకీయనేత కొడుకు చనిపోతే ఇలాగే చేస్తారా?... ప్రశ్నించిన అమరజవాను తండ్రి
మావోయిస్టులు జరిపిన దాడిలో మృతి చెందిన వారి దుస్తులు, బూట్లు చెత్త కుప్పలో కనిపించడం పెను దుమారాన్ని రేపింది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని చెప్పి విచారణకు ఆదేశించినా పరిస్థితి సద్దుమణగలేదు. ఈ చర్యపై మృతవీరుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడి కొడుకు చనిపోతే ఇలాగే చేస్తారా? దేశం కోసం పోరాడి మరణించిన వాళ్ళ యూనిఫాంలకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని మావోల దాడిలో మృతి చెందిన కులదీప్ తండ్రి ధరంపాల్ పూనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.