: జార్ఖండ్ లో ఉద్యోగులను అపహరించిన మావోలు


జార్ఖండ్ లో మావోయిస్టులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అపహరించారు. రాష్ట్రంలోని చైబసలో నేటి తెల్లవారుజామున నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. అయితే మావోల అపహరణకు గురైన ఉద్యోగులు ఏ శాఖలకు చెందినవారన్న విషయం తెలియరాలేదు. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడితో తమ ఉనికిని బలంగా చాటుకున్న మావోలు, ఉద్యోగుల అపహరణతో జార్ఖండ్ లోనూ తామున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News