: ఈనెల 9న తెలంగాణ రాష్ట్ర అఖిలపక్ష భేటీ
ఈ నెల 9వ తేదీన అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ నగరానికి చెందిన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, వినాయక్ సాగర్ నిర్మాణం, మురికివాడల్లో నివసిస్తున్న వారికి మెరుగైన ఆవాసాలు కల్పించడం, నగర అభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, శాసనసభ, శాసనమండలి నేతలను ఈ భేటీకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.