: సమాచార మార్పిడిలో రేషన్ డీలర్లు... రెడ్ హ్యాండెడ్ గా పట్టేసిన జడ్పీటీసీ
తహశీల్దార్ కార్యాలయంలోని అధికారిక సమాచారాన్నే తారుమారు చేసేందుకు యత్నించారు రేషన్ డీలర్లు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో వెలుగు చూసిన ఈ ఘటనలో సమాచార మార్పిడికి యత్నించిన రేషన్ డీలర్లను స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాము చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునే క్రమంలో ఆరుగురు రేషన్ డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి కంప్యూటర్లలోని సమాచారాన్ని మార్చే పనిలో నిమగ్నమయ్యారు. రేషన్ డీలర్ల దురాగతంపై సమాచారం అందుకున్న జడ్పీటీసీ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.