: 'టైమ్స్' ఈ ఏటీ మేటి వ్యక్తి మోదీనే!


ఈ ప్రకటనకు ఇంకా మూడు రోజుల సమయముంది కదా అంటారా? ఉంటే ఉండొచ్చు కాని, సోమవారమైనా టైమ్స్ ప్రకటించేది భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరునేగా. ఎందుకంటే, టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణలో బుధవారం నాటికి మోదీ 12.8 శాతం ఓట్లతో అగ్రస్థానానికి ఎగబాకి తన తర్వాతి స్థానాల్లో ఉన్నవారికి అందనంత వేగంగా దూసుకెళుతున్నారు. ఇక మోదీ తర్వాత రెండో స్థానంలో కొనసాగతున్న ఫెర్గూసన్ ఆందోళనకారులు 10.1 శాతం ఓట్లతో మోదీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. వీరు మోదీ కంటే ఎక్కువ ఓట్లను సాధించడం దాదాపుగా అసాధ్యమని సాక్షాత్తు టైమ్స్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వాహకులే చెబుతున్నారు. ఏటా డిసెంబర్ 6న ప్రజాభిప్రాయ సేకరణను ముగించే టైమ్స్, 8న విజేతను ప్రకటిస్తుంది. ఇక ఈ పోటీలో మూడో స్థానానికి ఎగబాకిన హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమనేత జోషువా ఓంగ్ 7.5 శాతం ఓట్లను సాధించారు. పాకిస్థాన్ బాలల హక్కుల ఉద్యమకర్త మలాలా యూసుఫ్ జాయ్ 5.2 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అత్యంత ధైర్యసాహసాలు చూపి ఎబోలా వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించిన వైద్యులు, నర్సులు 4.5 శాతం ఓట్లను దక్కించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (4.1 శాతం ఓట్లు) ను ఆరో స్థానానికి దిగజార్చేసి ఐదో స్థానానికి ఎగబాకారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఈ జాబితాలో కేవలం 2.3 శాతం ఓట్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News