: చంద్రబాబు, కేసీఆర్ లతో ప్రధాని మోదీ ఉమ్మడి భేటీ!


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడిగా భేటీ కానున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఢిల్లీలో జరగనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఇద్దరు తెలుగు సీఎంలు ఢిల్లీ వెళుతున్నారు. ఈ క్రమంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండుతో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానిని కలిసేందుకు యత్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రుల సదస్సుకు చంద్రబాబు కూడా వస్తున్న నేపథ్యంలో ఇద్దరితో ఉమ్మడిగా భేటీ నిర్వహిస్తే, భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య అభిప్రాయభేదాలు పొడచూపవన్న భావన కేంద్రంలో వ్యక్తమవుతోంది. ప్రతి విషయంలోను రెండు రాష్ట్రాలూ కత్తులు దూసుకుంటున్న నేపథ్యంలో ఈ తరహా భేటీ సత్ఫలితాలనిస్తుందని కూడా కేంద్రం భావిస్తోంది. ఇప్పటిదాకా ఇలాంటి భేటీకి సంబంధించి స్పష్టత లేకున్నా, ఇద్దరు సీఎంలతో ఉమ్మడి భేటీకి ప్రధాని మోదీ ఆసక్తి కనబరుస్తున్నారని ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడం ఖాయమేనన్న మాట.

  • Loading...

More Telugu News