: మాజీ మంత్రి ముత్యంరెడ్డికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం : కేసీఆర్
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా తను అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ముత్యంరెడ్డిని అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఆయన ప్రయాణ, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.