: ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా ఒక్కర్నే అనుకున్నా: రేణూదేశాయ్
'పవన్ కల్యాణ్ తో విడిపోయి నాలుగేళ్లు అయింది కదా...ఇంకా గతంలోనే బతకడం ఎందుకు?...కొత్త జీవితాన్ని ప్రారంభించు' అని తన ఆప్తులు చాలా మంది సలహాలు ఇస్తున్నారని రేణూదేశాయ్ తెలిపింది. పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు అంశాలను వెల్లడించిన రేణూదేశాయ్, తనకు 17 ఏళ్లున్నప్పుడే తాను ప్రేమించి, పెళ్లి చేసుకోవాలనుకున్నానని, చచ్చేవరకూ ఒకరేనని అప్పట్లోనే అనుకున్నానని, ఇప్పుడిప్పుడే ఒంటరితనం అనే భావన బాగా అనుభవిస్తున్నానని రేణూ స్పష్టం చేసింది. భవిష్యత్ ను ఎవరూ నిర్ణయించలేరని చెప్పిన రేణూ, జీవితం ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలని పేర్కొంది.