: ఎంతో మంది అభిమానులు నన్ను మళ్లీ అక్కడికే వెళ్లమంటున్నారు...కానీ, ఎలా?: రేణూదేశాయ్
మీరు మళ్లీ పవన్ వద్దకు వెళ్లండని ఎంతో మంది అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తనకు సలహా ఇస్తున్నారని రేణూదేశాయ్ తెలిపింది. తన వైవిహిక జీవితాన్ని ఎవరూ నిర్ణయించలేరని, తాను వెళ్లినా ఏమని వెళ్లగలనని ప్రశ్నించింది. ఇది తనకు చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రశ్న అని రేణూ చెప్పింది. తనకు మాత్రమే వెళ్లాలని ఉంటే సరిపోదు కదా? అని ఆమె ప్రశ్నించింది. అంతే కాకుండా వారికి కూడా వ్యక్తిగత జీవితాలు ఉన్నాయి కదా? అని అడిగింది. తనది గడచిపోయిన అధ్యాయమని రేణూదేశాయ్ వివరించింది. తాను వాస్తవం నుంచి జీవితాన్ని నేర్చుకుంటున్నానని రేణూదేశాయ్ వెల్లడించింది.