: గుంటూరు రేంజ్ పరిధిలో 79 మంది సీఐల బదిలీ
గుంటూరు రేంజ్ పరిధిలో 79 మంది సీఐలను బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్ కుమార్ ఈ రోజు రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రేంజ్ పరిధిలో ఉన్న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువకాలం ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయడంతో పాటు ప్రతిభ ఆధారంగా పోస్టింగులను కేటాయించారు.