: కల్యాణ్ నుంచి నేను 40 కోట్లు తీసుకున్నానన్నది అవాస్తవం!: రేణూదేశాయ్


పవన్ కల్యాణ్ నుంచి విడాకుల కోసం 40 కోట్ల రూపాయలు తీసుకున్నానన్నది పచ్చి అబద్ధమని రేణూదేశాయ్ తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరించారు. తనను ఈ విషయంలో చాలా మంది ఆడిపోసుకున్నారని, అందరికీ వాస్తవం తెలుసుకునే రోజు వస్తుందని తాను భావించానని రేణూ తెలిపింది. అప్పట్లో దీనిని క్లియర్ చేయండంటూ పలువురు సన్నిహితులు సూచించినప్పటికీ తాను ఎవరికి చెప్పాలి? ఎందుకు చెప్పాలి? అని భావించి మౌనంగా ఉన్నానని రేణూ తెలిపింది. అలాగే డబ్బు సంపాదన విషయంలో పవన్ ను ఆపుతున్నాననే అపోహ ఉంది. అయితే, తాను పవన్ చేసిన ప్రతి పనిలోనూ వెంట ఉన్నానని తెలిపింది. తాను పవన్ ఏదంటే అదే చేశానని రేణూదేశాయ్ వివరించింది.

  • Loading...

More Telugu News