: అత్యాచారానికి ఖరీదు కట్టారు!


గ్రామ, కుల పంచాయతీల దౌర్భాగ్యం దేశాన్ని ఇప్పట్లో వీడేట్లు కనిపించడం లేదు. తాజాగా, బీహార్లో ఓ పంచాయతీ అత్యాచారానికి మూల్యం నిర్ణయించింది. రూ.50,000 తీసుకుని, అబార్షన్ చేయించుకోవాలని బాధితురాలకి సూచించింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, అప్పటికే ఆమె 7 నెలల గర్భవతి. నలుగురు సోదరులు ఈ 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశారు. దీంతో, ఆమె ఊరి పంచాయతీకి ఫిర్యాదు చేసింది. కిషన్ గంజ్ జిల్లాలోని పకోలా పలాష్మని గ్రామంలో జరిగిందీ ఘటన. అయితే, పంచాయతీ పెద్దలు మాత్రం నేరాన్ని డబ్బుతో సమాధి చేయాలని ప్రయత్నించారు. పోలీసులకు చెప్పొద్దంటూ బెదిరించారు కూడా. కానీ, బాధితురాలు ఆ డబ్బును నిరాకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో తమ దృష్టికి వస్తున్నాయని మహిళా పోలీసు అధికారి శ్వేతా గుప్తా తెలిపారు.

  • Loading...

More Telugu News