: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ కన్నుమూత


సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ (100) మరణించారు. అనారోగ్యంతో కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1952లో కేరళ శాసనసభకు ఎన్నికైన ఆయన, 1957లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1973లో సుప్రీంకోర్టు జడ్జిగా అయ్యర్ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో రాజకీయ నాయకుడిగా ఉండి, అనంతరం న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అతికొద్దిమందిలో అయ్యర్ ఒకరు. 1999లో 'పద్మ విభూషణ్' పురస్కారం అందుకున్నారు.

  • Loading...

More Telugu News