: సంబరాల్లో మునిగిన టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ విధాన ప్రకటన చేయగానే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తమ నేత నిలుపుకున్నారని తెలుగు తమ్ముళ్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాలలోని టీడీపీ ఆఫీసుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.