: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అర్ధరాత్రి వేళ ఇళ్లలో ప్రవేశించి దోపిడీలకు పాల్పడటమే కాకుండా, అడ్డొస్తే హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఏడుగురిని నేటి మధ్యాహ్నం అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.13 లక్షల నగదును, 5 వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో, దొంగల ఆగడాలను అరికట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు వివరించారు.