: యూఎస్ కాన్సులేట్ కు వెళ్లనున్న కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో యూఎస్ కాన్సులేట్ కు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను హైదరాబాదుకు ఆహ్వానించే అంశంపై కాన్సులేట్ అధికారులతో మాట్లాడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఒబామా భారత్ వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో కూడా పర్యటించాలంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఒబామాను ఆహ్వానిస్తూ కాన్సులేట్ కు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News