: రుణమాఫీకి జగన్ వ్యతిరేకం: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రుణమాఫీ పథకాన్ని అడ్డుపెట్టుకొని జగన్ చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. మాఫీ వల్ల రుణాలు ఎగవేసే పరిస్థితి వస్తుందని ఆనాడు వై.ఎస్. రాజశేఖరరెడ్డి చెప్పిన మాటలను సీఎం గుర్తు చేసుకుంటూ, జగన్ సైతం అదే దారిలో నడిచారని, 2014 ఎన్నికల ముందు కూడా జగన్ తాను రుణమాఫీకి వ్యతిరేకమని చెప్పారని విమర్శించారు. ఏ ప్రయోజనం ఆశించి జగన్ ధర్నా చేయదల్చుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.